రాముడుద్భవించినాడు - జంఝూటి రాగం, మధ్యమ శృతి - రూపక తాళం
ప) రాముడుద్భవించినాడు - రఘు కులంబున శ్రీ ||రాముడు
తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీ ||రాముడు
1) తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెల్ల
విని కురియింప విరుల వాన ||రాముడు
2) దశరధుండు భూసురులకు ధనమొసంగగా
విసర మలయ మారుతము - దిశలెల్లను విశదములౌ
వసుమతి దుర్భరము బాప ||రాముడు
3) కలువలను మించు కనుల కాంతి వెల్గగా
పలువరుసా ఆణిముత్య కలములొయన
కళలొలుకగ కిలకిలమని నవ్వుచు శ్రీ ||రాముడు
4) ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగ దాసు మొరలిడగను
కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ ||రాముడు
Comments
Post a Comment